Tuesday, March 1, 2011
నిర్వాణ శటకం (Nirvana Shatakam, Nirvana Shatkam in Telugu)
శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ |
మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||
అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న వా బన్దనం నైవ ముక్తి న బంధః |
చిదానంద రూపః శివోహం శివోహం ||
న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||
శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ |
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
Hi,
Thanks for posting this as an open source-Amala Srinivasa
Thanks for posting. Meaning for each of the Slokas and word is very beneficial to the aspirants.
Plz put the telugu Meaning in telugu
i am very grateful to you for this contribution... available for everyone to copy and paste... god bless you..
Who am i? you are god..."I AM" GOD the one god in all who all call themselves as I AM.
Dear Auther,
Thank you, for the post.As Iam staying out side my home,I have no access to the same. On this aspecious day of Shivaratri, I am able to read Nirvana Shatkam.
Thank you so much
నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు. నేను పంచభూతాలు కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివున్ని. నేను శివుడిని
నేను ప్రాణాన్ని కాదు. పంచవాయువులు నేను కాదు. సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని
నాలో రాగద్వేషములు లేవు,లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు,తీర్థాలు,వేదాలు,యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాన్ని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని
నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని
Adbutham Adbhutham Adhbutham
I have been listening this last 3o yrs
Now I understood what I have been listening
Super bro
thanks for the meaning
danyavadamulu
Thanks a lot for providing the meaning...
thanks @Rao Yendluri sir for the meaning...
Second sentence in first stanza correct as
"న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే"
@raoyendaluri garu...నిర్వాణ సూక్తము యోక్క అర్థము వివరముగా తెలిపినందుకు చాలా ధన్యవాదములు.
Daily repeat this, you see lot of change with in.
ధన్యవాదాలు రావు గారు
Great post, Keep posting
Kerala spice online
Post a Comment