Saturday, May 14, 2011

శ్రీ ఆది శంకరాచార్య - ప్రతి సంగ్రహం (Sree Adi Shankaraacharya - A Brief Transcript)

ముమూక్షువులు సంధ్యావందనం ఆచరిస్తూంటారు, సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తూంటారు.
मित्रस्य चर्षणी धॄत: श्रवो देवस्य सानसिम् । सत्यं चित्रश्रवस्तमम्॥
మిత్రస్య చర్షణీ దృత: శ్రవో దేవస్య సానసిం।
సత్యం చిత్ర్రశ్రవస్తవం ॥[ఋగ్వేదం ౩.౫౯.౬;కృష్ణయజుర్వేదం
౩.౪.౧౧.౫;౪.౧.౬.౩;శుక్లయజుర్వేదం ౧౧.౬౨]
मित्रो जनान् यातयति प्रजानन् मित्री दाधार पॄथिवीमुहद्यम्।
मित्र: कॄष्टीरनिमिषाभिचष्टे सत्याय हव्यं घॄतवद्विधेम॥
మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రో దాధార పృధివీముతద్యం।
మిత్ర: కృష్టీరనిమిషాభిచష్టె సత్యాయ హవ్యం ఘృతవద్విధెమ॥
[ఋగ్వేదం ౩.౫౯.౧]


ఇలా చేస్తుండగా రకరకాల మార్గాలావారు అనగా శైవులు, జైనులు, బౌద్ధులు తమతమ శ్రవంతులతో, భాష్యాలతో సంచరిస్తూ ఉంటారు.(ఇది ఆనాటి దేశాకాలమానాల్ని ప్రతిబింబించటంకొరకు)

శివగురు గాయత్రీ మంత్రంతో స్నానమాచరిస్తూ ఆ సూర్యభగవానుకి అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు. ఇంతలో, ఆర్యాంబ, శంకరుల తల్లి, తులసికోటలో నీరుపోస్తుంటుంది. శివగురు తన సూర్యకార్యం ముగించుకుని ఇంటికిజేరుకుని సంధ్యావందనానికి
ఉద్యుక్తుడైన సమయంలో, మృత్యువు వచ్చి, కార్యాలూ అన్నీ అయ్యాయా అని అడిగితే, అయ్యాయి అని జవాబిచ్చిన శివగురునితో ఇలా అంటాడు మృత్యువు "అంత్యేచ సర్వం కృష్ణార్పితం, ఏమంటారు" అని, వెళ్లిపోతాడు.
అతను వెళ్లిన వైపు చూస్తున్నంతలో నేపధ్యంలో ఈ శ్లోకం:
परात्मानमेकं जगद्बीजमाद्यं
निरीहं निराकारमोंकारवेद्यम्
పరాత్మానమేకం జగత్బీజమాద్యం
నిరీహం నిరాకారమొంకారవెద్యం
|

అలా వెళ్లిపోయిన మృత్యువు కోసం వెతికిన శివగురు, తన నిత్య కర్మలని ముగించుకుని, తనకి ఆ పరమాత్మలో మమేకమయ్యే సమయం ఆసన్నమైందని గ్రహించి కొంచెం భారమైన వదనంతో అక్కడి యజ్ఞజ్యాలల్ని చూసి, తనచితిమంటని ఊహించుకుంటాడు.
యజ్ఞజ్వాల, చితిమంట - జ్వాల మనిషిలోని మాటని, చూపుని మేధని తనలోకి ఇమిడ్చేసుకుంటుంది అని గ్రహించి ఇలా గుర్తిస్తాడు:
यतो जायते पाल्यते येन विश्वं
तमीशं भजे लीयते यत्र विश्वम्

యతో జాయతే పాల్యతే యేన విశ్వం
తమీషంభజే లీయతే యేన విశ్వం


అతనికి కనువిప్పు కలుగుతుంది. తన పుత్రుణ్ణి పిలిచి, ఇలా చెప్తాడు "ఇదమస్య శరీరం అశాశ్వతం, అహం గమిష్యామి శాశ్వతం పదం". ఇలా చెప్పి మృత్యుని మితృడిలా భావించు అని చెప్పి, తాను నేర్పిన శ్లోకాన్ని చెప్పమని
చెప్తాడు. శంకరులు ఈ శ్లోకాన్ని పఠిస్తూంటారు
"आकाशात पतितं तोयं यथा गच्छति सागरम्
सर्व देव नमस्कारः केशवम् प्रति गच्छति
"
"ఆకాశాత్ పతితం తోయం యధా గచ్ఛతి సాగరం
సర్వ దేవ నమస్కార: కేశవం ప్రతి గచ్ఛతి
"
ఈ శ్లోకం చెప్పేలోపే శివగురు ఆ కేశవునిలో కలసిపోతాడు.
నియమానుసారం వేదాధ్యనానికి ఉద్యుక్తులౌతున్నప్పుడు "ప్రజ్ఞాన శర్మ" మితృడిలా జత చేరుతాడు శంకరులతో. మృత్యు, ప్రజ్ఞాన శర్మ లతో ఉన్న శంకరులు రెండు పక్షులని చూస్తారు, ఒకటి కాకి, ఇంకోటి పావురం.
ఉపనిషత్తుల్లో చిత్రించినట్లుగా, కాకి - చేయువాడు(Doer), పావురం - చూసేది (Observer).
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयारन्यः पिप्पलं स्वाद्वत्त्यश्रत्रन्न्यो अभिचाकशीहि ॥
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతె
తయోరన్యా: పిప్పలం స్వద్వత్తి అనశ్నన్నన్యో అభిచాకశీహి

[ఋగ్వేదం ౧.౧౬౪.౨౦].
రెండు పక్షులూ ఒకే చెట్టుపై ఉంటాయి. ఒకటి దొరికిందల్లా తింటూ ఉంటుంది. ఇంకోటి గమనిస్తూ ఉంటుంది. గమనించేదే ఆత్మ అని తెలుసుకుంటారు శంకరులు.
శంకరులు తన మితృలను తన గురువుకి పరిచయం చేస్తారు. సరె, వెళ్లి కూర్చో ఆంటారు గురువు శంకరులతో. ప్రజ్ఞాన శర్మ, మృత్యు గురువుదగ్గరకి వెళ్లి ఆచార్యా, నా పేరు ప్రజ్ఞాన శర్మ, నా పేరు మృత్యు అని విన్నవించుకుంటారు,
ఆయన, అబ్బాయిలూ మృత్యవుకి, జ్ఞానాకీ
శరీరం ఉండదూ
, అవి కేవలం మీ పేర్లే అని వెళ్లి కూర్చోండి మీరూనూ అంటాడు. మృత్యు ఇలా అంటాడు - అజ్ఞానులు కేవలం నశ్వరమైన శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తారు అని.

ఒకానొక రోజున మాధుకరం కోసం ఓ బీద బ్రాహ్మణ గృహానికి భిక్షకి వెళతారు.
శ్లోకం:
निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम्।
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः
నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవసంయుతం
పిబత భాగవతం రసమాలయం ముహురహొ రసికా భువి భావుకా:

Ah (aho), men full of feeling (rāsikāḥ) who have a taste for the beautiful and poetical (bhāvukāḥ) on the earth (bhuvi), drink pibata) constantly (múhur) till dissolution (ā-layam) the elixir or sap (rasam) (called) Śrīmadbhāgavatapurāṇa (bhāgavatam), which consists (samyutam) of the nectarean (amṛta) fluid (dravá) (that came out) from the mouth (mukhāt) of Śúka --the son of Vyāsa-- (śúka) (and is) the fruit (phalam) fallen down (galitam) from the wishing tree (kalpa-taroḥ) (known as) Nigama --i.e. the Veda-s-- (nigama)

ఆ ఇల్లాలు భిక్ష పెట్టటానికి తనవద్ద ఏమీలేక పోవటంతో ఉసిరికాయల్నిని భిక్షలా పెట్టటానికి వస్తుంది. పెట్టి కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మా!! మీరు మా అమ్మతో సమానం, దేనికి ఈ కన్నీరు అని అడిగిన శంకరులతో, బిడ్డా, నా పతి, మా కుటుంబ అవసరాలకి సరిపోను పదార్ధాలని మాత్రమే తెస్తారు. ఆయన దృష్టిలో "అవసారానికన్నా ఎక్కువ కూడాబెట్టటం మహా పాపం". అందుకే నీకు ఇంతకన్నా భిక్ష పెట్టలేకపోతున్నా అంటుంది.
ఆ భిక్షతో చలించిపోయిన శంకరులు ఇరవైఒక్క పన్నాలతో ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తారు (కనకధారాస్తోత్రం).
अंगं हरे: पुलकभूषण माश्रयन्ती भृगांगनैव मुकुलाभरणं तमालम।
अंगीकृताखिल विभूतिरपांगलीला मांगल्यदास्तु मम मंगलदेवताया:
అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనైవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥


ఆమెవద్దనుండి భిక్షని స్వీకరించిన శంకరులు, ఆ పక్క ఇంటికి వెళ్తారు భిక్ష కోసం.

శ్లోకం:

విజ్ఞానవతితం సర్వం పశ్యత్యాంతర చక్షుషా
కరామలకవద్విశ్వం భూతభవ్య భవత్ప్రభు:

అక్కడ చాలా మంది భిక్షని స్వీకరిస్తూంటారు. శంకరుల వంతువచ్చేసరికి, శంకరులు "మీ భిక్ష నాకు వద్దు" అని వెళ్లి పోతుంటారు. ఏమీ? దేనికి వద్దు అంటున్నావు అని ప్రశ్నిస్తాడు ఆ ఇంటి యజమాని, మీ పొరిగింటివారు ఇలా విశ్వసిస్థున్నారు - "అనవసరమైన దానికన్నా ఎక్కువ కూడాబెట్టుటా పాపం" అని, "కానీ ఇక్కడ మీరు అవసరానికి మించి కూడబెట్టారు, అందుకు" అని భికషని స్వీకరించకుండా తిరిగివెళ్లిపోతారు.

అప్పుడా ధనికుడు నిజం గ్రహించి తన సంపాదనంతా దానధర్మాలు చేస్తాడు.

(కనకధారా స్తోత్రం చదివినప్పుడు కనకం ధారాపాతంగా ఆ బీదరాలి ఇంట కురిసింది అని అందరూ అంటారు. కానీ నాకు అది అంతగా అర్ధం కాలేదు. దేనికంటే, నిజమైన ధనం బంగారం కాదు. మరియూ ఆమె/ఆమె పతీ నమ్మిన, శంకరులు వారి పొరుగు ధనికునికి చెప్పిన సిద్ధాంతం - అవసరంకన్నా ఎక్కువ వద్దూ అని. మరి అలాంటప్పుడు ఆమె ఇంటా బంగారం వానకురిసిందా లేకా ఆ దేవి ఆశీస్సుల వాన కురిసిందా?)

శంకరులు తమ గురువు నుండి "సన్యాసం సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింతలకు మార్గం" అనితెల్సుకుంటారు. ఆ గురువు సన్యాసాశ్రమం గురించి, బ్రహ్మచర్యం గురించి,
గోవిందభగవత్పాదుల గురించీ వివరిస్తాడు. శంకరులు సన్యసించాలని ఆశిస్తారు. కానీ తల్లి ఒప్పుకోదు.
శంకరులు తమకు తెలిసిన ఒక బ్రాహ్మణున్ని గమనిస్తారు. అతను తన ఇంట కొబ్బరికాయలు దొంగలించటానికి వచ్చిన దొంగకి తిండిపెట్టి, కావాల్సిన పదార్ధాలు, కొబ్బరికాయలూ ఇచ్చి పంపిస్తాడు. ఆ దొంగ చేత ప్రమాణం కూడా చేయించుకుంటాడు, ఇక దొంగతనం వద్దూ అని. శంకరులు ఆశ్చర్యంతో అతన్ని అడిగితే ఇలా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు -దేహస్య దండనం క్షణికం, మనో దండనం చిరాస్థయి (*) అని.
అక్కడి సంవాదం
దోంగచేత ప్రమాణం చేయించుకున్నా ఆ బ్రాహ్మణుణ్ని శంకరులు ప్రశ్నిస్తారు
"ఈదశ్య మిదం దందనం?"
"వత్సా!! దేహస్య దండనం క్షణికం, మనో డండనం ఛిరస్థాయి, ఇత:పరం నైవ చోరయతిసహ"
"కోవిశ్వాసహ?"
"సోయం విశ్వాసహ, సచ వైదికో ధర్మ:, ఇదానిం తత్సర్వం శిధిలాయతే"
అప్పుడు శంకరులు "మన నిజమైన వైదిక ధర్మం శిధిలమౌతున్నదీ" అని తెల్సుకుంటారు.

శంకరుల గురువు నిజాన్ని కనుగొనటానికీ అర్ధం చేసుకొనటానికీ మార్గం - renunciation అంటే పరిత్యాగం, లేక విసర్జనంఅని బోధిస్తాడు. పరిత్యాగం అంటే సన్యసించటం అని. అంటే కాషాయం ధరించటం. ప్రజ్ఞాన శర్మ తల్లిని ఒప్పిస్తాడు. ఇంతలో "నచికేత-మృత్యు" అనే ఓ రూపకం చూస్తారు శంకరులు. తల్లి యొక్క అనుమతితో గురువుని వెతుక్కుంటూ దేశాటనకి బయలుదేరతారు.
[నచికేతుడి తండ్రి యజ్ఞకాలంలో దానం చేస్తుంటాడు. "నచికేత" ని ఎవ్వరికిస్తాఊ అని అడుగుతాడు నచికేతుడు తండ్రిని, ఆయన సహాధానం చెప్పడు. మళ్లీ మళ్లీ అడుగుతాడు నచికేతుడు. ఆయనకి కోపం వచ్చి, "నిన్ను ఎముడికి ఇస్తా" అంటాడు. నచికేతుడు తండ్రి మాటపై, యముడు వద్దకు వెళ్తాడు. యముడు అతన్ని మాటల్తో మభ్యపెట్టానికి చూస్తాడు, కానీ నచికేతుడు తెలివిగా యముడి గారడీలో పడకుండా, చావు అవతల ఏంటో తెలుకోగోరతాడు. చావుకవతల భగవంతుడే కాబట్టి, నచికేతుడు మోక్షం పొందుతాడు.]
శంకరులు గురువుని వెత్తుకుంటూ బయలుదేరతారు. ఆయన ప్రయాణంలో ఎన్నో విషయాలను తెల్సుకుంటూ ముందుకి సాగుతుంటారు. చావు ఎంత బలమైనదో తెల్సుకుంటారు, కానీ జనులు చావుని జనులు సరిగ్గా అర్ధం చేసుకోవటంలేదనీ గమనిస్తారు. అలా ప్రయాణిస్తున్న శంకరులు ఉత్తర కర్ణాటక లోని గోకర్ణానికి చేరుకుంటారు. అక్కడ విష్ణు శంకరులతో కలిస్తాడు. వాళ్లిరువురూ, మధ్యప్రదేశ్ గుండా ప్రయాణం సాగిస్తూంటారు. ఆ ప్రయాణంలో విష్ణు శంకరా, సన్యసిస్తే వేదంలో చెప్పినట్టుగా ధర్మ అర్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను ఛేధించినట్లేకదా అని ప్రశ్నిస్తే, శంకరులు బ్రహ్మచర్యం తర్వాత ఎవ్వరైనా
సన్యసించవచ్చని చెప్తారు (౨). అలా ప్రయాణం సాగించిన మితృలు ఇద్దరూ నర్మదా నదీ తీరానికి చేరుకుంటారు. అక్కడ విష్ణు నర్మదా నదిలో కొట్టుకుపోతాడు(౩) (తర్వాత మళ్లీ కాశీలో శంకరుల శిష్యునిగా స్వీకరింపబడి శంకరులచే
పద్మపాదాచార్య గా నామకరణం చేయబడతాడు).
त्वमादिदेवः पुरुषः पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम्।
वेत्तासि वेद्यं परं च धामत्वया ततं विश्वमनन्तरुप।।
త్వమాదిదేవ: పురుష: పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానం
వెత్తాసి వేద్యం పరం చ ధామత్వయా తతం విశ్వమనంతరూప


శంకరులు నర్మదానదిని ప్రార్ధించి శాంతింపజేస్తారు. అటునుండి గోవిందపాదుల పాఠశాలకు చేరుకుంటారు. గోవిందపాదులను వివేకచూడామణి లోని మొదటి శ్లోకంతో ఆకట్టుకుంటారు.
सर्व वेदांत सिद्धान्त गोचरं तमगोचरं ।
गोविन्द परमानन्दं सत्गुरुं प्रणतोस्म्यहम् ॥
సర్వ వేదాంత సిద్ధాన్త గోచరం తమగోచరం ।
గోవిన్ద పరమానన్దం సత్గురుం ప్రణతోస్మ్యహం॥


గోవిందపాదులు శంకరులని ఇలా పరీక్షిస్తారు
"నశ్వరమైన ఈ శరీరంతో జీవన సముద్రాన్ని ఎలా దాటతావు"
శంకరులు ఇలా బదులిస్తారు
"దేహానికి ఈ చావు బతుకులూ, ఆత్మకి కాదు."
గోవిందపాదులు సంతసించి, "పరమహంసో భవిష్యసి" అని దీవించి సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా చేర్చుకుంటారు.
శ్లోకం:
स एवाधस्तात्स उपरिष्टात्स पश्चात्स पुरस्तात्स
दक्षिणतः स उत्तरतः स एवेदँ सर्वमित्यथातोऽहंकारादेश
एवाहमेवाधस्तादहमुपरिष्टादहं पश्चादहं पुरस्तादहं
दक्षिणतोऽहमुत्तरतोऽहमेवेदँ सर्वमिति॥७.२५.१॥

अथात आत्मादेश एवात्मैवाधस्तादात्मोपरिष्टादात्मा
पश्चादात्मा पुरस्तादात्मा दक्षिणत आत्मोत्तरत
आत्मैवेदँ सर्वमिति स वा एष एवं पश्यन्नेवं मन्वान एवं
विजानन्नात्मरतिरात्मक्रीड आत्ममिथुन आत्मानन्दः स
स्वराड्भवति तस्य सर्वेषु लोकेषु कामचारो भवति
अथ येऽन्यथातो विदुरन्यराजानस्ते क्षय्यलोका भवन्ति
तेषाँ सर्वेषु लोकेष्वकामचारो भवति


అలా గోవిందపాదుల శిష్యునిగా చేరిన శంకరులు, బాదరాయణ, వ్యాస విరచితాలైన వేదాలు గ్రంధాలు దుమ్ముకొట్టుకుపోయి శిధిలావస్థలో ఉండటాన్ని గమనించి ఆయన అనుమతితో పునరుద్ధరించటానికి, భాష్యం రచించటానికీ ఉద్యుక్తులౌతారు.
శంకరుల సహవిద్యార్ధులు ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు కానీ, "సర్వం బ్రహ్మ" ఎలా అవుతుందీ అని ప్రశ్నిస్తారు. శంకరులు మృత్తిక ఏవ సత్యం అని చెప్పు, సత్యకామ-జాబాలి ల కధ ద్వారా వారిని ఒప్పిస్తారు.
శ్లోకం:
सत्यकामो ह जाबालो जबालां मातरमामन्त्रयांचक्रे
ब्रह्मचर्यं भवति विवत्स्यामि किंगोत्रो न्वहमस्मीति
సత్యకామో హ జాబాలో జబాలాం మాతరమామన్త్రయాంచక్రే
బ్రహ్మచర్యం భవతి వివత్స్యామి కింగోత్రో న్వహమస్మీతి

No comments: